భారత పాకిస్తాన్ సీజ్ ఫైర్ వెనుక కఠోర వాస్తవాలు,కొన్ని కర్తవ్యాలు

 *భారత పాకిస్థాన్ సీజ్ ఫైర్: అసలు వాస్తవాలు, మన కర్తవ్యాలు*

*డా.బీ.ఎస్. చక్రవర్తి*

*ఇటీవలి ఘటనలు*: *యుద్ధం ముంగిటకు వచ్చి, నాలుగు రోజుల్లోనే సీజ్ ఫైర్*

భారతదేశం ఈ మద్య పాకిస్థాన్ తో యుద్ధం ముంగిటవరకూ వెళ్లి మరీ నాలుగు రోజుల లోనే ముగించే ఏర్పాట్లు జరిగాయి. అసలు ఏం జరుగుతొంది, మనం ఏ రకం గా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి?! అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం!


ఈ ఘటనలు చాలా వేగంగా జరిగాయి. భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధం జరుగుతుందనే ఆందోళనలు కలిగిన సమయంలో, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా నాలుగు రోజుల్లోనే సీజ్ ఫైర్ ప్రకటించారు. కానీ, ఈ సీజ్ ఫైర్ వెనుక అనేక అంతర్జాతీయ రాజకీయ కారణాలు, దేశాల మధ్య సంబంధాలు, మరియు వాటి ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలను సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.


*యుద్ధం: ఎవరికీ మేలు చేయదు, ముఖ్యంగా భారత్ లాంటి దేశానికి*


యుద్ధం ఏ దేశాని కీ క్షేమం కాదు. ఇండియా వంటి పేద దేశానికి అసలు కాదు. ఏ దేశం  లోనైనా, ప్రతి  యుద్ధం లో తప్పకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా ఎక్కువ గా జరుగుతుంది. చరిత్ర ఎరిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయం చాలా తేలికగా అర్ధం అవుతుంది.

భారతదేశం లాంటి దేశంలో, ఇప్పటికీ పేదరికం, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలు పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. యుద్ధం జరిగితే, ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఎందుకంటే, యుద్ధానికి అయ్యే ఖర్చు కోట్లాది రూపాయలు. ఈ డబ్బును సైనిక శక్తి కోసం ఖర్చు చేయడం వల్ల, అభివృద్ధి పనులకు నిధులు తగ్గుతాయి. అంతేకాక, యుద్ధంలో ప్రజలు తమ ప్రాణాలు, ఆస్తులు కోల్పోతారు. ఇది దేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.

*బలమైన సైనిక శక్తి: యుద్ధ నివారణకు ఒక మార్గం*

భారత దేశం ఒక బలమైన సైనిక శక్తి. ఇది దేశానికి, ఒక దృఢమైన రక్షణ కవచం! 

కేవలం సైనిక శక్తి మీద ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమం పణం గా పెట్టి మరి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 

ఎందుకంటే మనం ఎంత బలం గా ఉంటామో, ప్రత్యర్ధి యుద్ధానికి, ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.

భారత దేశం వంటి సౌర్వభౌమ దేశానికి అయితే మరీ ఎక్కువ! 

మన దేశానికీ అంతర్గత, బహిర్గత శత్రువులు చాలా ఎక్కువ. కేవలం ఈ డిఫెన్స్ బడ్జెట్ ఖర్చు విషయం మీద నే, ఎప్పుడూ ఏదో ఒక అవినీతి ఆరోపణ వినిపిస్తునే ఉంటుంది. 

అందుకనే భారత దేశం సహితం, యుద్ధ నివారణ కై ఎప్పడూ దౌత్య మార్గాలు వెతుకతుంది కాని , నిజానికి పూర్తి స్తాయి యుద్ధం ఎప్పుడూ కోరుకోదు!!

*పాకిస్థాన్: చరిత్ర, భావజాలం, మరియు దాని ప్రమాదం*

మన పొరుగింటి దేశం పాకిస్థాన్ విషయం వేరు. దాని పుట్టుకే ప్రపంచం లో ఎక్కడా జరగని వింత కారణం అయిన మతం నెపం తో ఏర్పడింది. భారతదేశం లో హిందువులందరూ, ఇస్లాం ని, ముస్లింలను అంతరిస్తారని నమ్మబలికి, భారత దేశానికి కుడి, ఎడమల గా ఒక వింత దేశం గా1947 లో  ఏర్పడింది. 

 కానీ, 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించినప్పుడు, మతం ఆధారంగా దేశాన్ని ఏకం చేయలేమని ప్రపంచానికి స్పష్టమైంది. ప్రజలకు మతం కంటే ముఖ్యంగా వారి భద్రత, ఆర్థిక స్థిరత్వం, మరియు ప్రాథమిక అవసరాలు ముఖ్యమని ఈ ఘటన రుజువు చేసింది.

*పాకిస్థాన్ లోని అసలు సమస్య: ప్రజాస్వామ్యం లేకపోవడం, సైనిక పాలన*

పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం అనేది పేరుకు మాత్రమే. నిజమైన అధికారం అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వాలు కేవలం సైన్యం చెప్పినట్లు నడుచుకుంటాయి. ఈ కారణంగా, పాకిస్థాన్ ప్రజలు తమ పాలకులు చెప్పే అబద్ధాలను నమ్ముతూ, భారతదేశం పట్ల విద్వేష భావనతో జీవిస్తున్నారు. ఈ విద్వేష భావనను పాకిస్థాన్ సైన్యం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది.

*పాకిస్థాన్ భౌగోళిక ప్రాముఖ్యత: అంతర్జాతీయ మద్దతు*

పాకిస్థాన్ భౌగోళికం గా ఒక చాలా కీలకమైన స్థలం లో ఉన్నది.ఇది మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మరియు మధ్యప్రాచ్యం మధ్య ఒక వంతెన లాంటిది. ఈ కారణంగా, అమెరికా, చైనా, ఇరాన్, టర్కీ, సౌదీ అరాబియా వంటి దేశాలు పాకిస్థాన్ కు ఆర్థిక, సైనిక మద్దతు ఇస్తాయి. చైనా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్ట్ దీనికి ఒక ఉదాహరణ. అమెరికా కూడా గతంలో ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ ను ఉపయోగించుకుంది. ఈ మద్దతు వల్ల పాకిస్థాన్ ఎన్ని తప్పులు చేసినా, అంతర్జాతీయంగా దానికి పెద్దగా నష్టం జరగదు.  అమెరికా, చైనా, ఇరాన్, టర్కీ, సౌదీ అరాబియా, మరియు వీరి మిత్ర దేశాలు, పాకిస్థాన్ ఎప్పడూ ఇబ్బందులలో ఉన్నా, పంచె సర్దుకుని, భుజాన కండువ వేసుకొని మరీ పెద్దరికం నటించి పాకిస్థాన్ ప్రయోజనాలు కాపాడతాయి. బిలియన్స్ డాలర్లు, ఆయుధాలు అంద జేస్తాయి.

 *భారతదేశం సంయమనం: ఎందుకు పూర్తి యుద్ధం కోరుకోదు?* 

ఇవన్ని భారత దేశానికి తెలుసు. ఈ అంతర్జాతీయ రాజకీయాలు చాలా సున్నితంగా ఉంటాయి. చాలా క్లిష్టమైన విషయాలు ముడిపడి ఉంటాయి. అందుకని, భారత దేశం ఎప్పడూ చాలా సంయమనం పాటిస్తుంది.

భారతదేశం ఈ అంతర్జాతీయ రాజకీయాలను బాగా అర్థం చేసుకుంది. పాకిస్థాన్ తో యుద్ధం అంటే, ఒక్క పాకిస్థాన్ తోనే కాదు, *దానికి మద్దతు ఇచ్చే చైనా, అమెరికా వంటి దేశాలతో కూడా పరోక్షంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.* అందుకే భారతదేశం ఎప్పుడూ సంయమనం పాటిస్తుంది, దౌత్య మార్గాలను ఎంచుకుంటుంది.

 *పెహల్గామ్ ఎటాక్: దాని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలు* 

ఒకసారి పెహల్గామ్ ఎటాక్ ముందు ఏం జరిగిందో పరిశీలిద్దాం!

అమెరికా లో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక, చైనా తన మీద రాబోయే అమెరికా చేసే వాణిజ్య యుద్ధం గమనించింది. ఆసియాలో భారత దేశం తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని ఊహించింది. అందుకనే ముందుగా భారత దేశానికి స్నేహ హస్తం అందించింది. కానీ, భారతదేశం అమెరికాతో తనకు కలగబోయే ప్రయోజనాలు గుర్తించి, ఈ స్నేహ ప్రతిపాదనకు ఎటూ తేల్చలేదు. 

ఈ పెహల్గామ్ ఘటన వెనుక చైనా మరియు అమెరికా మధ్య ఉన్న వాణిజ్య యుద్ధం, ఆసియాలో ఆధిపత్యం కోసం చేసే పోటీ ఉన్నాయి. చైనా, భారతదేశం బలంగా ఎదగడాన్ని ఇష్టపడదు. అందుకే, తన స్నేహిత దేశమైన పాకిస్థాన్ ను ఉపయోగించి, భారతదేశం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. పెహల్గామ్ ఎటాక్ దీని ఫలితమే.

 *భారతదేశం స్పందన: టార్గెటెడ్ ఎటాక్స్, పూర్తి యుద్ధం కాదు* 

ఇంత జరిగినా కూడా, భారత దేశం ఎంతో సంయమనం తో పాకిస్థాన్ తో యుద్ధం ప్రకటించలేదు. కేవలం పాక్ భూభాగం లో తీవ్రవాద స్థావరాలమీదనే టార్గెటెడ్ ఎటాక్ చేసింది. పాకిస్థాన్ ప్రజలను కాదు .ఎందుకంటే పూర్తి స్థాయి యుద్ధం అంటూ వస్తే ఇటు పాకిస్తాన్ అటు చైనా మద్యలో మనం ఇరుక్కునే వారం. పైగా ఇప్పడు బంగ్లాదేశ్ లో చైనా పాకిస్థాన్ మద్ధతు తో నడిచే ప్రభుత్వం, ఉండటం వలన అది కూడా  మన మీద దాడి చేసే అవకాశం ఉంది.ఇది భారత దేశానికి చాలా ప్రమాదకరం!

 *పాకిస్థాన్ రాజకీయ లబ్ధి: భారత్ ను బూచిగా చూపడం* 

కానీ, భారతదేశం టార్గెటెడ్ ఎటాక్స్ పాకిస్థాన్ పాలకులకు, తమ అసమర్ధ, అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి ని మరల్చి, భారత్ దేశం బూచీ ని మరొకసారి చూపించి మబ్యపెట్టే అవకాశం దొరికింది.

ఇలా పాకిస్థాన్ పాలకులు, ఈ ఎటాక్ ను తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారు. అక్కడి ప్రజల దృష్టిని తమ అసమర్థ పాలన, అవినీతి నుంచి మరల్చడానికి, భారతదేశాన్ని శత్రువుగా చూపించి, ప్రజలలో భయం, 

విద్వేషం రేకెత్తించారు.

 *సీజ్ ఫైర్: చైనా, అమెరికా పాత్ర* 

చైనా తన వాణిజ్య ప్రయోజానలకై పాకిస్థాన్ ను మరోసారి సమర్ధించింది. ఇది చూసి, చైనా ని నివారించడానికి అమెరికా మరోకసారి మద్యలో దూరి సీజ్ ఫైర్ ఇరుదేశాలతోనూ ప్రకటించేసింది.

ఈ సీజ్ ఫైర్ లో చైనా మరియు అమెరికా రెండూ తమ ప్రయోజనాల కోసం పనిచేశాయి. 

చైనా, పాకిస్థాన్ ను మద్దతు ఇచ్చి, భారతదేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. 

అమెరికా, చైనా ప్రభావాన్ని తగ్గించడానికి, సీజ్ ఫైర్ ప్రకటించింది. కానీ, ఈ సీజ్ ఫైర్ భారతదేశానికి పూర్తిగా అనుకూలంగా లేదు.

 *భారతీయుల అసంతృప్తి: సీజ్ ఫైర్ ఎందుకు నచ్చలేదు?* 

ఇది భారతీయులకు అస్సలు రుచించలేదు. యుద్ధం పైచేయి గా ఉండే సమయం లో ఇలా అగ్రరాజ్యం మధ్యలో దూరడం కొత్త కానే కాదు. అయితే ఈ సారి పాకిస్థాన్ కూ పూర్తి అనుకూలం గా ప్రకటన రావడం నచ్చలేదు.  

ఈ సీజ్ ఫైర్ ప్రకటనలో, అమెరికా పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరించిందనేది బహిరంగ రహస్యం ! 

భారతదేశాన్ని, పాకిస్థాన్ తో సమానంగా చూడటం, కాశ్మిర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానడం, వాణిజ్య ఒప్పందాలలో పాకిస్థాన్ కు ప్రయోజనం కలిగించడం వంటివి భారతీయులకు నచ్చలేదు. 

భారతదేశం ఒక బలమైన, స్వతంత్ర దేశం, అయినప్పటికీ, అమెరికా దానిని పాకిస్థాన్ తో సమానంగా చూడటం భారతీయులకు అవమానకరంగా అనిపించింది.

 *అమెరికా నిర్ణయం: ప్రవాస భారతీయులపై ప్రభావం* 

ఇప్పుడు తాజా గా ( *కాకతాళీయం గా?)* అమెరికా లో విదేశాలకు నగదు బదిలీ పై 5% పన్ను విధించడం వలన, మన ప్రవాస భారతీయులు సుమారు 45 లక్షల మంది తమ మాతృ దేశానికీ నగదు బదలీ పై లక్ష కు ఐదువేలు పన్ను పడటంతో వారు వెనుకంజ వేయవచ్చు! భారతదేశం లో రియల్ ఎస్టేట్, పరిశ్రమల పెట్టుబడుల మీద పడి ఏమాత్రం ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి.

అమెరికా ఈ కొత్త పన్ను విధానం వల్ల, ప్రవాస భారతీయులు భారతదేశానికి పంపే డబ్బు తగ్గవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పరిశ్రమల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చు. ఇది భారతదేశానికి మరో ఆర్థిక సవాలుగా మారవచ్చు.

 *అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు: భారత్ కు నష్టం* 

ఇలా అమెరికా...పాకిస్థాన్ కు ఎల్లప్పుడూ చిరకాల మిత్రత్వం వలన చివరికి భారత దేశం నష్టపోతునే ఉంటుందనేది కఠోర వాస్తవం!

అమెరికా మరియు పాకిస్థాన్ మధ్య చిరకాల సంబంధాలు భారతదేశానికి నష్టం కలిగిస్తున్నాయి. అమెరికా, తన భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్థాన్ కు మద్దతు ఇస్తుంది, దీని వల్ల భారతదేశం ఎప్పుడూ నష్టపోతుంది.

 *సోషల్ మీడియా దేశభక్తులు: యుద్ధ ఉన్మాదం, నిరుత్సాహం* 

ఈ వాస్తవాలు సరిహద్దుకు దూరం గా, ఈ సంక్లిష్టతలు ఏమాత్రం అర్ధం కాని సోషల్ మీడియా.. దేశభక్తులతోనే వచ్చింది అసలు చిక్కు. ఎందుకంటే వీరికి, యుద్ధం, దాని పర్యావసనాలు, నష్టం, వంటివి పట్టవు. ఒక ఉన్మాదం తో పాకిస్థాన్ పీచమణచాలని, పీఓకే మనకు వచ్చేయాలని, రంకెలు వేస్తారు. వీరిని చూసి మరికొందరు కాలక్షేపరాయుళ్ళు మరింత ఆవేశం తో రెచ్చిపోతున్నారు. శాంతి ప్రతిపాదన రాగానే తీవ్ర నిరుత్సాహం లో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ఊహించింది జరగక పోవడం వలన ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. వీరిని కంట్రోల్ చేయడం ప్రస్తుతానికి ప్రభుత్వానికి తలకు మించిన భారమౌతోంది.

 ఈ ఆవేశం, యుద్ధం యొక్క నష్టాలను అర్థం చేసుకోకుండా ఉండటం వల్ల వస్తుంది. ఈ విధమైన ఆవేశం ప్రభుత్వానికి మరింత ఒత్తిడి కలిగిస్తుంది.

 *పాకిస్థాన్: ఒక రోగ్ కంట్రీ,* 

పాకిస్థాన్ గురించి ప్రజలు కొన్ని వాస్తవాలు గుర్తెరగాలి! 

పాకిస్థాన్ ఒక రోగ్ కంట్రీ. అక్కడ, ప్రభుత్వమే తీవ్రవాదాన్ని  ప్రొత్సహిస్తుంది. ఈ విషయం, అగ్రరాజ్యం సహా అందరికీ తెలుసు. అయినా సరే తమ ప్రయోజనాల కై ఈ పాము ను పెరట్లో పెంచి పోషిస్తున్నాయి. ఏదో రోజు ఆ పాము తమ మీద కు కూడా విషం చిమ్ముతుందని తెలిసినా అవి అలాగే మూర్ఖం గా మద్దతు తెలుపుతున్నాయి.

 *మన కర్తవ్యం: ధర్మం మీద నమ్మకం, సహనం* 

ఇక్కడ ధర్మం, న్యాయం ఎటు ఉన్నాయో తెలుస్తునే ఉన్నాయి. ఇటువంటి ధర్మసంకటం ఏర్పడినప్పుడు,  ప్రజలు సహనం తో ధర్మం మీద నమ్మకం ఉంచి నడచుకోవాలి. 

ఎందుకంటే, ఎనాటి కైనా ధర్మం మాత్రమే విజయం సాధిస్తుంది. 

అధర్మం వైపు భగవంతుడు ఎప్పుడూ ఉండడు.

అధర్మానికి కాపు కాసే భీష్మ ,ద్రోణ,కర్ణాదులు వంటి గొప్ప, మహామహులు కూడా పుట్టగతులకు లేక పోతారని మన పురాణాలు ఉద్భోదిస్తున్నాయి.

 ధర్మ సంస్థానార్తాయ, సంభావామి యుగే, యుగే అని  అధర్మాన్ని అంతరించాడానికి భగవంతుడు తప్పక ధర్మాన్ని తిరిగి పునరుద్ధాస్తాడు.

 మనం మన ధర్మాని కి కట్టుబడి, ఓపిక గా సహనం తో  వేచియుండటమే తక్షణ కర్తవ్యం.

Comments

Popular posts from this blog

Time-Restricted Eating: Giving the Body Time to Heal*

కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా?

ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dr B.S.Chakravarthy