పిల్లల చేతుల్లో కొత్త సాంకేతికత - భయమా? వరమా?
బాలలకు కృత్రిమ మేధ అవసరమా? - ఒక స్పష్టమైన దృక్పథం డా బీ.ఎస్.చక్రవర్తి. 28/10/2025 పిల్లల చేతుల్లో కొత్త సాంకేతికత - భయమా? వరమా? మన పాఠశాలల్లో ఇప్పుడు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశంలో భాగమైంది. ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు పిల్లలకు AI నేర్పిస్తున్నారు. కొంతమంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో పిల్లలకు AI అర్థమవుతుందా? కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ పర్రసెసింగ్, స్టాటిస్టిక్స్ వంటి క్లిష్టమైన అంశాలు ఏడవ తరగతి పిల్లలకు ఎలా అర్థమవుతాయి? ఎనిమిదవ తరగతిలో AI నైతికత, బాధ్యతాయుతమైన చర్యలు, తొమ్మిదవ తరగతిలో AI గణితం, జనరేటివ్ AI, పదవ తరగతిలో న్యూరల్ నెట్‌వర్క్స్, క్లస్టరింగ్ వంటివి నేర్పడం సరైనదా అని రామానుజం వంటి రచయితలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఆందోళన అవసరమా? AI గురించి స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ సందేహాలన్నీ తీరిపోతాయి. నేను శిశువైద్యుడిని కాబట్టి పిల్లల అభివృద్ధి, వారి అభ్యాసం గురించి చాలా ఆలోచిస్తాను. AI అనేది పిల్లలకు భయం కలిగించే రాక్షసుడు కాదు, వారి చదువులో తోడ్పడే మంచి స్నేహితుడు అని నా అభిప్రాయం. AI అ...