ఆంధ్ర నట సామ్రాట్ ,నిరంతర స్పూర్తి దాత — అక్కినేని నాగేశ్వరరావు
ఆంధ్ర నట సామ్రాట్ — అక్కినేని నాగేశ్వరరావు — డా. బి.ఎస్. చక్రవర్తి నటుడిగా కాదు, మనిషిగా ముద్ర వేసిన మహానుభావుడు 20 సెప్టెంబర్ 1923న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు తెరపైకి వచ్చి, ఏకంగా 250కి పైగా చిత్రాలు నటించి, ఏడు దశాబ్దాలపాటు తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, ఆలోచనలపై శాశ్వత ముద్ర వేసిన మహానుభావుడు. సమాజానికి అంకితమైన పాత్రలు దేవదాసు (1953)లోని విరహం, గుడిగంటలు (1964)లోని సామాజిక సందేశం, డాక్టర్ చక్రవర్తి (1964)లోని సేవా స్పూర్తి, ప్రీమాభిషేకం (1981)లోని త్యాగం—ఈ పాత్రలన్నీ ఆయన మనసులో ఉన్న సామాజిక బాధ్యతని ప్రతిబింబించాయి. ఆయన డైలాగ్ “ప్రేమకి ప్రాణం ఇచ్చిన పురుషుడు లోకంలో నేనే ఒక్కడిని” అనేది నేటికీ తెలుగు మనసుల్లో ప్రతిధ్వనిస్తుంది. నిర్మాతల హీరో – “మినిమమ్ గ్యారంటీ” అక్కినేని ఆయన పేరు పెట్టిన సినిమా అంటే నిర్మాతలకు నష్టం రాదనే నమ్మకం. ఇదే కారణంగా ఆయనను “ప్రొడ్యూసర్స్ హీరో” అని పిలిచారు. ఆయనపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఎప్పుడూ భయపడరు—కచ్చితంగా “మినిమమ్ గ్యారంటీ” లేదా విజయాన్ని అందిస్తారని నమ్మకం. ఇదే పంథ...