వృద్ధాప్యాన్ని ఆపలేము, కానీ దాన్ని నెమ్మెదించవచ్చు : టెలోమీర్లు, ఆటోఫేగీ, రైబోజోమ్స్ చెప్పే కథ

 వృద్ధాప్యాన్ని ఆపలేము, కానీ దాన్ని నెమ్మెదించవచ్చు : టెలోమీర్లు, ఆటోఫేగీ, రైబోజోమ్స్ చెప్పే కథ

డాక్టర్ B.S. చక్రవర్తి 

ఈ science అంతా మన తెలుగులో, మన మాటల్లో చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ageing అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం కాదు, దాన్ని ఎలా slow down చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.

మొదట ఒక నిజం చెప్పుకుందాం. మనం చావును ఆపలేం. అది జరగాల్సిందే. కానీ అదే వృద్ధాప్యం నెమ్మదిగా జరగాలంటే.. అది మన చేతుల్లో కొంచెం ఉంది. 

మన శరీరంలో cells అంటే కణాలు ఉంటాయి. వాటిల్లో DNA ఉంటుంది. ఆ DNA చివర్లల్లో టెలోమీర్లు అనే protective caps ఉంటాయి. Shoe laces చివర్లకి వేసే plastic tip లా అనుకోండి.

 cell division తో, అంటే ప్రతీసారి కణం విభజన చేసినప్పుడూ, ఈ టెలోమీర్లు కొంచెం కుదుగుతాయి( shortening of length) . చాలా కుదిగిపోతే కణానికి divide చేసుకోవడం ఆగిపోతుంది.

 అక్కడే వృద్ధాప్యం మొదలవుతుంది

 పొగతాగడం, నిద్రలేమి, ఊబకాయం, stress, తప్పుడు ఆహారం వంటివన్నీ టెలోమీర్ల shortening ను వేగం చేస్తాయి (PubMed Central) .

కానీ ఇక్కడ hope కూడా ఉంది. Stanford Medicine వారి recent study లో పిల్లల్లో ఊబకాయం ఉన్నప్పుడు, ఆరు నెలలు healthy eating మరియు exercise program చేయించినప్పుడు, వాళ్ళ telomere length పెరిగింది (Stanford Medicine) .

 అంటే మనం చేసే choices నిజంగా matter అవుతాయి.

ఆహారం: టెలోమీర్లకు fuel

Smoking, insomnia, alcohol వంటివి telomere shortening తో link అయ్యాయి, అదే సమయంలో vitamins, minerals, polyphenols, omega-3 fatty acids వంటివి telomere length ని positively influence చేస్తాయని studies చెబుతున్నాయి (Frontiers) .

ముఖ్యంగా ఏమిటంటే, polyphenols అనే plant compounds – resveratrol, curcumin, quercetin, catechins – ఇవి apples, pears, cherries, berries, peppers, carrots, tea, coffee, olive oil, garlic, onions లో ఎక్కువగా ఉంటాయి. ఇవి powerful antioxidants గా చేసి telomerase కి stability ఇస్తాయి (PubMed Central) .

ఇప్పుడు practical గా ఆలోచిస్తే, పిల్లలు మరియు యువకుల్లో higher consumption of fish, nuts and seeds, fruits and vegetables, especially green leafy and cruciferous vegetables, olives, legumes, polyunsaturated fatty acids తో longer telomere length కనిపించింది. 

మరోవైపు dairy products ఎక్కువ గా తీసుకోవడం,, simple sugar, sugar-sweetened beverages, white bread, high glycemic load diet వంటివి telomere shortening తో associate అయ్యాయి (PubMed Central) .

మన తెలుగు వంటల్లో చెప్పాలంటే: నువ్వులు, వేరుశెనగలు (nuts and seeds), కూరగాయలు - ముఖ్యంగా palakura, మెంతికూర, cauliflower,cabbage (green leafy and cruciferous), pappu రకాలు (legumes), fish రెండు-మూడు రోజులకోసారి. చాలా బాగా టె

Telomere length ని తగ్గకుండా చేసాయి.

మరియు మార్కెట్ biscuits, cool drinks, white bread ను cut చేస్తే మంచిది. 


Autophagy: శరీరంలో cleanup వ్యవస్థ

Nobel Prize గెలుచుకున్న Yoshinori Ohsumi వారు కనిపెట్టిన autophagy అంటే cells తమ damaged parts ని recycle చేసుకోవడం. ఇది survival mechanism. Nutrient restriction లేదా fasting వల్ల autophagy activate అవుతుందని animal models లో clear గా చూపించారు.

కానీ humans లో? ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. 121 మంది obesity ఉన్న people తో ఒక study చేసినప్పుడు, intermittent time-restricted eating (iTRE) group లో 6 months తర్వాత autophagy markers లో significant difference కనిపించింది standard care group తో compare చేస్తే (PubMed) . కానీ ఈ effect clear cut గా "16 hours fast = autophagy switched on" అని చెప్పలేము.

Dawn-to-dusk intermittent fasting చేసిన overweight మరియు obese people లో నాలుగు వారాల తర్వాత autophagy genes LAMP2, LC3B, ATG5 ల expression significantly పెరిగింది - LAMP2 దాదాపు 4.2 రెట్లు, LC3B 1.9 రెట్లు (ScienceDirect) . అదే సమయంలో bodyweight, BMI, fat mass, inflammation markers అన్నీ తగ్గాయి.

*Practical approach ఏమిటంటే:* Intermittent fasting లేదా calorie restriction adaptive autophagy ని induce చేసి cells longevity పెంచవచ్చు, కానీ prolonged calorie restriction with excessive autophagy harmful అవుతుంది (PubMed Central) .

 మన శరీరానికి balance కావాలి.

16:8 pattern (16 hours fast, 8 hours eating window) అనేది many people కి practical గా work అవుతుంది. కానీ దీని main benefit autophagy magic కాదు - ఇది late night eating ఆపడం, calorie control, insulin sensitivity improve చేయడం వంటివి. రాత్రి 8 గంటలకి dinner ముగించి, మరుసటి రోజు 12 గంటలకి మొదటి భోజనం చేస్తే, ఆ మధ్యలో water, black coffee లేదా green tea తాగవచ్చు.

కానీ ఈ fasting అందరికీ కాదు: pregnant women, children, eating disorders ఉన్నవాళ్ళు, frail elderly, diabetes ఉండి insulin తీసుకునేవాళ్ళు - వీళ్ళంతా doctor advice తప్పనిసరి.

*mTOR మరియు Ribosomes: Growth signal ల story*

Ribosome అంటే cell లో protein factory. Nobel Prize winning work వల్ల మనకు ribosomes ఎలా పనిచేస్తాయో తెలిసింది. Proteins , tissue repair కి, enzymes కి, immunity కి.అవసరం. 

కానీ constant high calorie intake, constant growth signalling వల్ల problems వస్తాయి..

ఇక్కడ mTOR అనే pathway key role పోషిస్తుంది. mTOR అనేది cellular processes అన్నిటినీ regulate చేస్తుంది - autophagy, metabolism, cellular senescence, protein synthesis. Increased mTOR activity అనేది aging characteristic (PubMed Central) .

ఇక, ఒక 2024 Nature Aging paper చూపించింది: mTOR activity కొంచెం పెరిగినా, aging ముందుగానే వస్తుంది, animals lifetime 20% వరకు తగ్గుతుంది (News-Medical) . 

ఇది మనకు obesity మరియు aging మధ్య connection explain చేస్తుంది. High body mass index ఉంటే inflammation, metabolic burden పెరుగుతుంది, mTOR constantly active అవుతుంది.

Calorie restriction వల్ల longevity ఎందుకు పెరుగుతుందో కూడా ఇది explain చేస్తుంది. mTOR pathway protein and lipid synthesis promote చేస్తుంది, autophagy inhibit చేస్తుంది. Lysosomal nutrient-sensing pathway దగ్గర ఇది regulate అవుతుంది, autophagy transcriptionally control చేస్తుంది TFEB మరియు FOXO transcription factors ద్వారా, ఇవి lifespan extension తో associate అయ్యాయి (PubMed) .

Simple గా చెప్పాలంటే: మన cells కి growthphases కావాలి, repair phases కూడా కావాలి. రెండూ balance లో ఉండాలి. 

Constant eating, high calories, poor sleep వల్ల mTOR always "growth mode" లో ఉంటుంది. 

Body repair చేసుకోవడానికి time దొరకదు.

*ఇప్పుడు Practical anti-ageing routine ఎలాగో చూద్దాం*: మన Telugu style లో

ఇప్పుడు science అంతా తెలుసుకున్నాం. 


అయితే Action plan ఏమిటి?

ఆహారం (Food):

రోజుకు మూడు సార్లు సరళంగా మనం తీసుకునే ఆహారం

ఉదయం: Eggs లేదా మరో protein source, పచ్చి కూరగాయలతో (tomatoes, palakura), berries (blackberries, blueberries దొరికితే, లేదా local fruits).

మధ్యాహ్నం: పెద్ద salad – mixed vegetables, chickpeas or other legumes, pumpkin seeds, olive oil and lemon dressing. Brown rice లేదా quinoa కొంచెం.

సాయంత్రం: చేపలు (fish) వారానికి రెండు-మూడు సార్లు, లేదా vegetarian అయితే plant omega-3 sources. Walnuts,flax seeds వంటివి. Cruciferous vegetables - broccoli, gobi, Brussels sprouts (available in metros). Pappu, sweet potato.


Snacks కావాలంటే: walnuts, berries, carrots with hummus, dark chocolate ఒక smallpiece.

Recent studies లో Plant protein intake telomere length తో positively associated అయింది ., moderate-high protein diet ఊబకాయం ఉన్నవాళ్ళలో telomere length పెంచింది, especially women లో (MDPI) .


Lifestyle:

Exercise: Physical activity plus diet group లో telomere length increase కనిపించింది (Effect size 0.17), control group లో telomere shortened (-0.32) (ScienceDirect) .

 రోజూ 30 minutes walking or cycling.

 వారానికి రెండు రోజులు strength training - ఇది muscle mass preserve చేస్తుంది, metabolic health improve చేస్తుంది.

Stress management:

Meditation, slow breathing. చాలా మంచిది

 Chronic stress telomere shortening accelerate చేస్తుంది hypothalamic-pituitary-adrenal axis dysregulation ద్వారా, cortisol anomalous secretion వల్ల (PubMed Central) . 

రోజూ 10-15 minutes calm breathing చేయడం worthwhile.

Sleep: 7-8 hours consistent, good quality sleep.

 Poor sleep వల్ల stress hormones పెరుగుతాయి, 

insulin resistance worse అవుతుంది, 

brain gene expression related to protein handling alter అవుతుంది.


*Social connection:* Strong relationships healthier behaviors promote చేస్తాయి, chronic stress reduce చేస్తాయి. Family, friends తో good time spend చేయడం longevity plan లో important part.


Bottom line

Smoking, obesity, truncal adiposity, sarcopenia combined with obesity – ఇవన్నీ telomere attrition significantly accelerate చేస్తాయి.

 Oxidative stress and inflammation ఇవి key mechanisms (Frontiers) (PubMed Central) .

*మన చేతుల్లో ఉన్న solution:* inflammation తగ్గించే foods, time-restricted eating (body కి repair time ఇవ్వడానికి), daily movement, calm breathing, quality sleep. Metabolic syndrome ఉంటే, ఇవి optional lifestyle advice కాదు - ఇవి foundation. 

మీరు ఏ medicine తీసుకున్నా, ఇవి లేకుండా పని చేయవు.

Ageing ను ఆపలేం, కానీ దాన్ని dignified గా, healthy గా చేయవచ్చు. మన cells already protection systems, recycling systems, repair systems అన్నీ కలిగి ఉన్నాయి. 

మనం చేయాల్సింది simply, వాటికి సహకరించడం, 

interference చేయకుండా ఉండడం.

*సరళమైన ఆహారం, time boundaries, movement, peace of mind. ఇదే formula.*

Expensive treatments, supplements, complicated diets - ఇవన్నీ after thoughts. 

*మూలాధారం మనం చేసే daily choices.*

Telomeres మనకు చెబుతున్నాయి chronic stress avoid చేయమని. Autophagy చెబుతుంది constant feeding ఆపండి, breaks ఇవ్వండి అని. Ribosomes and mTOR చెబుతున్నాయి nutrition quality maintain చేయండి, కానీ excess growth signaling ఆపండి అని.

Science complex గా కనిపిస్తుంది, కానీ message simple: శరీరానికి అవసరమైనది ఇవ్వండి, అనవసరమైనది తొలగించండి. 

Inflammation తగ్గించండి, repair time ఇవ్వండి, 

movement maintain చేయండి. 

Ageing లో magic లేదు, కానీ consistency ఉంది.

ఈ రోజే మొదలు పెట్టవచ్చు. 

Complicated కాదు, costly కాదు, కానీ effective. మన grandparents చెప్పినవన్నీ science ఇప్పుడు prove చేస్తోంది: సాధారణ ఆహారం, సాధారణ జీవితం, stress లేకుండా ఉండడం.

హాయిగా ఉండండి, healthy గా ఉండండి.


References:

1.Frontiers in Aging - Lifestyle factors and telomere shortening (2025)

2.PMC - Nutrition impact on telomere health

3.Stanford Medicine - Exercise and telomere reversal in children (2024)

4.MDPI - Polyphenol-rich diets and telomere length (2023-2024)

5.MDPI - Mediterranean diet and telomere biology (2024)

6.MDPI - Protein diet and telomere beneficial effects (2025)

7.PMC - Dietary factors in childhood affecting telomere length

8.PMC - Nutrition and lifestyle in healthy aging

9.ScienceDirect - Lifestyle intervention effect on telomere length (2022)

10.PMC - Autophagy and caloric restriction effects (2023)

11.PubMed - Intermittent fasting and autophagy in humans (2025)

12.GeroScience - Fasting-mimicking diet on autophagy markers (2025)

13.ScienceDirect - Dawn-to-dusk fasting and autophagy genes (2024

14.PMC - mTOR role in aging (2024)

15.News Medical - mTOR activity and lifespan (2024)

16.PubMed - mTOR and aging regulation

17.Nature Aging - mTOR and aging processes (2024)

Comments

Popular posts from this blog

Time-Restricted Eating: Giving the Body Time to Heal*

కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా?

ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dr B.S.Chakravarthy