డాక్టర్స్ డే 2025, ! ఆత్మ పరిశీలన కు ఒక అవకాశం !

 *డాక్టర్స్ డే: ఒక ఆత్మపరిశీలనకు పిలుపు*

*డా బీ.ఎస్. చక్రవర్తి*

భారతదేశంలో ప్రస్తుతం సుమారు *15 లక్షల మంది వైద్యులు* ఉన్నారని అంచనా. ఇది ఒక గొప్ప సంఖ్య. కానీ మన దేశంలో ప్రతి పౌరునికి *సమానమైన ఆరోగ్య భద్రత* ఇంకా ఒక అసాధ్య కలగానే మిగిలిపోతోంది. మన వైద్య విద్య వ్యవస్థలో *వైవిధ్యం*, *నాణ్యత లోపం*, *వనరుల కొరత* ఇంకా ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి.

*వైద్య కళాశాలల్లో విద్యా స్థాయి, నైపుణ్య అభివృద్ధి* దేశమంతటా ఒకేలా ఉండకపోవడం, పట్టభద్రుల శిక్షణలో తేడాలు, దీనికి తోడు *భౌతిక వనరుల కొరత*, *అభ్యాసం చేసే ఆసుపత్రుల సామర్థ్యం తక్కువగా ఉండటం*, ఇవన్నీ కలసి వైద్యుల శక్తిని పూర్తిగా వెలికి తీసే అవకాశం లేకుండా చేస్తోంది. 

జాతీయ వైద్య మండలి ప్రయత్నిస్తున్నా, *సూక్ష్మంగా నాణ్యత నియంత్రణ* జరగకపోవడం వల్ల, *వ్యవస్థలో ఒక అసంతృప్తి* నెలకొంది.

*వైద్యులు కూడా మనుషులే!* వారికి శారీరక, మానసిక, సామాజిక అవసరాలు ఉన్నాయి. కాని వారు ఎన్నిసార్లు తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, ఇతరుల కోసం నిరంతరంగా పనిచేస్తుంటారు. ఇది ఒక త్యాగపూరిత వృత్తి. కానీ నేడు ఈ త్యాగం గుర్తింపు పొందడం లేదు. *నమ్మకం పోతోంది, గౌరవం తగ్గుతోంది.*

*చికిత్స వేగంగా కావాలన్న ఒత్తిడి*, కానీ మానవ శరీరం ఆ వేగానికి స్పందించదు. కార్పొరేట్ వైద్యవ్యవస్థ వలన ఖర్చులు పెరిగినాయి.

 దీని వల్ల *రోగి-వైద్యుని మధ్య నమ్మకం స్థానంలో అనుమానం*, 

*ఆర్థిక ఒత్తిడులు*, *అన్ ఎథికల్ ప్రాక్టీసులు* పెరిగిపోయాయి. వైద్యులు ఇప్పుడు *డాక్యుమెంటేషన్*, *లీగల్ ప్రూఫ్*, *కేసుల బందీ* గా మారిపోయారు. ఒక పేషంట్ మనిషిగా కాకుండా *ఒక కేసుగా మారిన దుస్థితి* మనం చూస్తున్నాం.

*టెక్నాలజీ వేగంగా ఎదుగుతోంది*, కాని మన వైద్యులు ఆ అభివృద్ధికి సరిపోయే శిక్షణ పొందే పరిస్థితి లేదు. ఇది మరో *అంతరం* కి దారి తీస్తోంది.

ఇన్ని సమస్యలకు మూలం ఏంటి?

ఎప్పుడూ, ఎంతో  గౌరవదాయకమైన వైద్య వృత్తి, ఎందుకు ఈ రోజుల్లో  కొంత  గౌరవం నమ్మకం కోల్పోయింది?

ఈ డాక్టర్స్ డే మనం *పునరాలోచించాల్సిన రోజు*.

మన వ్యవస్థను విశ్లేషించాల్సిన అవకాశం.

*పెరుగుతున్న చెందుతున్న సవాళ్లు:*

* *ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్* తగ్గుతూ పోవడం

* *మెడికల్ రంగ ప్రైవేటీకరణ*

* *వైద్యులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, రాజకీయాలు*

* *వైద్యులపై సోషల్ మీడియా ట్రయల్స్*

* *కాంట్రాక్టు జాబ్స్, తక్కువ జీతాలు, జాబ్ భద్రత లేకపోవడం*

* *దేశం వదిలి వెళ్లే వైద్యుల సంఖ్య పెరగడం*

*"Behind the Mask: Who Cares Caregivers?"* అనే నినాదం నిజంగా ఎంతో సత్యాన్ని చెబుతోంది.

ఈ సందర్భంగా, *సమాజం వైద్యులను గౌరవించాలి*. మానవతా విలువలతో, నైతికతతో నడిచే నిజమైన వైద్యులకు *ఆదరణ, రక్షణ, స్వేచ్ఛ* కల్పించాలి. 

అలాగే వైద్యులు కూడా *స్వీయ పరిశీలన*, *ఆత్మపరిశీలన*, *నైతికత**, *విజ్ఞానం* పట్ల కట్టుబాటు ఉండాలి.

ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి, ఒక మంచి మార్పు తేవాలని ప్రయత్నించాలి.

నమ్మకాన్ని తిరిగి పొందాలి.

*సేవ అంటే దాసోహం కాదు, అది ఒక గౌరవం.*

అది మనశ్శాంతికి దారి తీస్తుంది.

మన భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తుంది.

*ఈ డాక్టర్స్ డే, మనం మన బాధ్యతను గుర్తుంచుకుని, వైద్య వృత్తిని తిరిగి పరమ గౌరవ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆలోచించుకుందాం.*

Comments

Popular posts from this blog

Time-Restricted Eating: Giving the Body Time to Heal*

కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా?

ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dr B.S.Chakravarthy